నైవేద్యాలలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు వాడరు?
నీరుల్లిపాయ, వెల్లుల్లిపాయల విని యోగం దైవ నివేదనల్లో, ప్రసా దాల్లో కనిపించదు. అలాగే పూర్వ కాలం నుంచి కొన్ని వర్గాలవారికి వాటిని తమ ఆహారంలో వాటిని వినియోగిం చకపోవం ఆచారంగా వస్తోంది. ఆధ్యాత్మిక సాధనకు, ప్రశాంత జీవ నానికి సాత్వికాహారం ప్రధానమని సాధకులు చెబుతారు. నీరుల్లిని, వెల్లుల్లిని తామ, రజో గుణాలను పెంచే పదార్థా లుగా పూర్వులు పేర్కొ న్నారు. అవి కోపాన్ని, ఆందో ళనను, వాంఛలను పెంచుతాయి కాబట్టి యోగ సాధ నకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.'
'లశునం గృంజనం చైవ పలాండుం కవకాని చ/అభక్ష్యాణి ద్విజాతీనాం అమేధ్య ప్రభవాణి చ' అని మనుస్మృతి చెబుతోంది. “లశునం (వెల్లుల్లి), గృంజనం (ముల్లంగి), పలాండుం (ఉల్లిపాయ), కవకాని (పుట్టగొడుగులు)... ఇవి అశుద్ధమైన చోట పుడతాయి కాబట్టి ఉపాసకులు, శ్రీవి ద్యాసాధకులు వాటిని తినకూడదు” అని భావం.
ఆధ్యాత్మిక పరంగా: ఆత్మశుద్ధి, సాత్విక జీవన శైలి కోసం ఉల్లిని, వెల్లుల్లిని నిషిద్ధంగా పరిగణిస్తారు. అవి మనస్సును చంచలం చేస్తాయని చెబుతారు.
ఆయుర్వేదం, యోగ శాస్త్రం ప్రకారం: ఉల్లిపా యలు తామస, రజోగుణ ప్రేరేపకమైన పదార్థాలు, అవి శరీరంలో పైత్యరసాన్ని పెంచు తాయి. ఆవేశాన్ని, వాంఛలను రేకెత్తి స్తాయి.
పౌరాణికంగా చూస్తే: రాహు,కేతువుల రక్త బిందువుల నుంచి ఉల్లి, వెల్లుల్లి పుట్టాయంటారు. అందుకే వాటిని అశుద్ధమైనవిగా, రాక్షస ప్రవృత్తి కలిగించేవిగా భావిస్తారు.
దైవ నివేదన విషయానికి వస్తే: పూజలలో, దేవునికి సమర్పించే నైవేద్యంలో ఉల్లి, వెల్లుల్లిని అపవిత్రంగా భావించి వినియోగించరు. కాలక్రమేణా మారుతున్న అలవాట్ల వల్ల... పూర్వం వీటిని ఉపయోగించని వర్గాలు కూడా స్వీకరిస్తున్నప్ప టికీ... సంప్రదాయ ఆచారాలు పాటించేవారు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయితే... పూజల్లో వినియోగం, సాధకుల నియమాలను పక్కన పెడితే.... నిత్య ఆహార పదార్థాల్లో వీటిని వాడే విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు.

0 Comments