మంథని గౌతమేశ్వరాలయం: దక్షిణ కాశి చరిత్ర, శిల్పకళా వైభవం | Manthani Temple

 మంథని గౌతమేశ్వరాలయం: దక్షిణ కాశి చరిత్ర, శిల్పకళా వైభవం | Manthani Temple

తెలంగాణలో ‘ఉత్తర వాహిని’ గోదావరి తీరాన ఉన్న ఈ అద్భుత శివాలయం గురించి మీకు తెలుసా?

గౌతమేశ్వర స్వామి ఆలయం
Kshetrayanam by Praneeth 

శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం – మంథని: చరిత్ర, విశిష్టత మరియు స్థల పురాణం గురించి తెలుసుకుందాం…🙏🙏

తెలంగాణ గడ్డపై వేద మంత్రాల ఘోషతో నిత్యం పునీతమయ్యే నేల, ఆధ్యాత్మిక చైతన్యానికి మారుపేరుగా నిలిచే పుణ్యక్షేత్రం – మంథని. పూర్వం ‘మంత్రపురి’గా పిలవబడిన ఈ క్షేత్రం, గోదావరి తీరాన వెలసిన ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారం. కాశీలో గంగానది లాగే, ఇక్కడ గోదావరి నది **’ఉత్తర వాహిని’**గా ప్రవహిస్తూ, భక్తుల పాపాలను కడిగివేసే **’దక్షిణ కాశి’**గా ప్రసిద్ధి గాంచింది.

శతాబ్దాల చరిత్రను తన గర్భంలో దాచుకున్న మంథనిలో, కాకతీయ శిల్పకళా వైభవానికి సాక్ష్యంగా నిలుస్తుంది శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయం. గౌతమ మహర్షి స్వయంగా తపస్సు చేసి, పరమేశ్వరుడిని ప్రతిష్టించిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు, చరిత్ర ప్రేమికులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది. నేటి మన **’క్షేత్రయాణం’**లో భాగంగా, వేదపురిగా వెలుగొందుతున్న మంథని విశిష్టతను, గౌతమేశ్వర ఆలయ ప్రాముఖ్యతను మరియు గోదావరి తీరాన దాగి ఉన్న అద్భుత రహస్యాలను ఈ ఆర్టికల్‌లో లోతుగా తెలుసుకుందాం

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

అందరికి నమస్కారం నేను మీ ప్రణీత్ పురాతన ఆలయాలను సందర్శించడంలో భాగంగా దోమకొండ శివాలయాన్ని సందర్శించిన తర్వాత, నాలో పురాతన ఆలయాలను చూడాలనే ఆసక్తి మరింత పెరిగింది. అందుకే ఈసారి, తెలంగాణలోని వేదాల నెలవుగా ప్రసిద్ధి చెందిన 'మంథని' (పెద్దపల్లి జిల్లా) కు బయలుదేరాను.

హైదరాబాద్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల ప్రయాణం. దారిపొడవునా ప్రకృతి దృశ్యాలను చూస్తూ, గోదావరి నది ఒడ్డున ఉన్న మంథని పట్టణానికి చేరుకున్నాను. అక్కడ అడుగు పెట్టగానే నాకు అద్భుతమైన అనుభూతి కలిగింది.తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా, మంథని గ్రామంలోని శ్రీ గౌతమేశ్వర స్వామిని దర్శించడం జరిగింది. అక్కడ చుసిన విశేషాలు,ఆ గోదావరి నది పరువ్వాళ్ల్లు అలాగే అక్కడ పొందిన ప్రశాంతత నాకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఆ అనుభూతి ని మీకోసం ఈ article లో పూర్తిగా తెలుసుకుందాం…😁😁😁

తెలంగాణలో వేద ఘోష వినిపించే పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది ఒక్క మంథని (దీనిని పూర్వం మంత్రపురి అని పిలిచేవారు )మాత్రమే. గోదావరి నది తీరాన వెలసిన ఈ మంత్రపురిలో అడుగుపెడితే శతాబ్దాల చరిత్ర మనకు స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కొలువై ఉన్న గౌతమేశ్వర స్వామి కేవలం ఒక శివలింగం మాత్రమే కాదు, ఈ నేల యొక్క సంస్కృతికి, నాగరికతకు ప్రతిరూపం. ఒక్కో శిలా ఒక్కో రకకంగా వుంది మీరు చుస్తే ఇలాంటి శిల్ప సంపద మన తెలంగాణ లో వుందా అని మీరే ఆశ్చర్యనికి గురవుతారు.

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

ఈ ఆలయం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే పురాణాల ప్రకారం ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి వెనుక ఒక గొప్ప పురాణ నేపథ్యం ఉంది. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి గోదావరి నదిని తీసుకువచ్చారని మనకు తెలుసు కదా.ఆ ప్రయాణంలో భాగంగా ఆయన మంథని వద్ద ఆగి, ఈ ప్రాంతంలోని ప్రశాంతతకు ముగ్ధులై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి తపస్సు చేశారు. అందుకే ఈ స్వామిని ‘గౌతమేశ్వరుడు’ అని పిలుస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఆలయం లోని శివ లింగం 

Kshetrayanam by Praneeth 

ఇక్కడ శివలింగంన్ని చూడగానే మీయొక్క మనసు పులకించిపోయి ఆనంద పారవర్షంతో మునిగిపోతూ ఉంటారు ఈ 6 అడుగుల ఉంటుంది లింగనికి వున్నా వెండి కండ్లు స్వామివారి నిజంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది లోపల చల్లటి వాతావరణం ఉంటుంది ఎంత బయట వేడిగా ఉందని లోపల మాత్రం చల్లగా ఉంటుంది ఇంకా స్వామివారికి ఎదురుగా ఉన్న నందిని చూస్తే ఇంకా బాగుంటుంది పిలిస్తే ఇప్పుడే వస్తా అన్నట్లు ఉంటాడు నందీశ్వరుడు అలాగే కుడి పక్కన చిన్న శివలింగము మరియు గణపతి కూర్చొని ఉంటారు చాలా బాగా ఉంటుంది గణపతి కూడా నంది విషయానికొస్తే ప్రతి ఒక్క స్ట్రక్చర్ అనేది చాలా బాగా చెక్కరు.మంథని ఆలయం ప్రాముఖ్యత అంతలా ఉంది. మీరు లోపలికి వెళ్ళారనుకో బయటకు రావాలని అస్సలు అనిపించదు అక్కడే శివయ్యను చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది.

గర్భాలయంలోకి అడుగుపెట్టగానే వెండి నేత్రాలతో మెరిసిపోతున్న గౌతమేశ్వరుని రూపం మనల్ని కట్టిపడేస్తుంది. ఇక్కడి పానవట్టం నిర్మాణం చాలా విభిన్నంగా, ఎత్తుగా ఉండి ఒక రకమైన రాజసాన్ని ఒలకబోస్తుంది. ఆ ధారాపాత్ర నుండి పడే ప్రతి చుక్కా, ఆ గర్భాలయంలోని ప్రశాంతత మనసులోని అలజడిని తీసివేసి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి.”

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

ఉత్తర వాహిని – పరమ పవిత్ర గోదావరి:

భారతదేశంలో నదులు సాధారణంగా తూర్పుకో, పడమరకో ప్రవహిస్తాయి. కానీ మంథని వద్ద గోదావరి నది ఒక మలుపు తిరిగి ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. దీనినే ‘ఉత్తర వాహిని’ అంటారు. కాశీలో గంగానది కూడా ఇలాగే ఉత్తర దిశగా ప్రవహిస్తుంది. అందుకే మంథనిని ‘దక్షిణ కాశి’ అని పిలుస్తారు. ఇక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకోవడం వల్ల కాశీకి వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Kshetrayanam by Praneeth 

కాకతీయ శిల్పకళా అద్భుతం:

ఆలయ నిర్మాణం విషయానికి వస్తే, ఇది కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవానికి నిలువుటద్దం.

నల్ల రాతి స్తంభాలు: గర్భాలయం ముందున్న మండపంలోని స్తంభాలు ఎంతో నునుపుగా, అద్దంలా మెరుస్తూ ఉంటాయి. వీటిపై చెక్కబడిన సూక్ష్మ శిల్పాలు కాకతీయ శిల్పుల నైపుణ్యాన్ని చాటుతాయి.

జైన శైలి ప్రభావం: ఇక్కడి శిఖరం (విమానం) మరియు కొన్ని నిర్మాణ శైలులు జైన దేవాలయాలను పోలి ఉంటాయి. దీనిని బట్టి ఈ ప్రాంతంలో ఒకప్పుడు జైన మతం కూడా వర్ధిల్లిందని చరిత్రకారులు భావిస్తారు.

విగ్రహాల ప్రత్యేకత: ఆలయ ప్రాంగణంలో సూర్య భగవానుడు, గణపతి మరియు ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

మంత్రపురి: వేదాలకు నిలయం:

మంథనిని ‘మంత్రకూటం’ అని ఎందుకు అంటారంటే, ఇక్కడ పూర్వం ఇంటింటికీ ఒక వేద పండితుడు ఉండేవారు. నేటికీ ఇక్కడ వేద పాఠశాలలు, నిత్య అగ్నిహోత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక వాతావరణమే గౌతమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు ఒక మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

స్థానిక ప్రతీతి: ‘మజ్జిగ కుండ’ (మథనం)

స్థానికంగా ప్రజలు చెప్పే మరో కథనం ప్రకారం:

కారణం: పురాణ కాలంలో ఇక్కడ ఒక పెద్ద ‘మజ్జిగ కుండ’ ఉండేదని, ఆ కుండను మథనం (చిలకడం) చేయడం ద్వారా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ‘మథనం’ అనే పదం నుంచే ‘మంథని’ వచ్చింది అనేది వారి నమ్మకం.

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

Kshetrayanam by Praneeth 

నేను ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు, గోదావరి నది అలల శబ్దం, ఆలయ గంటల నాదం కలిసి ఒక వింతైన అనుభూతిని ఇచ్చాయి. ముఖ్యంగా ఆ నల్ల రాతి స్తంభాలను తాకినప్పుడు మన పూర్వీకుల శ్రమ, కళా హృదయం స్పష్టంగా కనిపిస్తాయి. ధ్వంసమైన కొన్ని విగ్రహాలను చూస్తే మాత్రం మనసు కొంచెం భారంగా అనిపిస్తుంది.” అలాగే నది ఒడ్డున వున్నా శివలింగం చాలా వింతగా ఉంటుంది ఒక శివలింగం నాలుగు ముఖాలు ఉంటే, మరో శివలింగనికే సర్ప అకృతి చెక్కి ఉంటుం. అటు పక్కనే స్మశానము కూడా ఉంటుంది.

మంథనిలో చూడవలసిన ఇతర ప్రదేశాలు

మంథని కేవలం గౌతమేశ్వరాలయానికే కాదు, మరెన్నో పురాతన కట్టడాలకు ప్రసిద్ధి:

బిక్షేశ్వర స్వామి ఆలయం: ఇక్కడి శివలింగం పశ్చిమాభిముఖంగా ఉండటం మరియు ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండటం చాలా అరుదైన విషయం.

లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శైలేశ్వర ఆలయం, మహాలక్ష్మి ఆలయం మొదలైన 20కి పైగా పురాతన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.

సందర్శకులకు సమాచారం

లొకేషన్: గౌతమేశ్వర ఆలయం, మంథని

సమయాలు: ఉదయం 5:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:00 నుండి రాత్రి 9:00 వరకు భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది.

మంథని చేరుకోవడం ఎలా?

రోడ్డు ద్వారా: కరీంనగర్ లేదా పెద్దపల్లి నుండి బస్సు లేదా సొంత వాహనంలో సులభంగా మంథని చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం (By Road)

మంథని పట్టణం తెలంగాణలోని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది.

హైదరాబాద్ నుండి: దాదాపు 210 కి.మీ. దూరంలో ఉంది. రాజీవ్ రహదారి (Rajiv Rahadari) మీదుగా కరీంనగర్ ద్వారా మంథని చేరుకోవచ్చు. (సుమారు 4 నుండి 5 గంటల ప్రయాణం).

కరీంనగర్ నుండి: కేవలం 65 కి.మీ. దూరంలో ఉంది. కరీంనగర్ నుండి ప్రతి 30 నిమిషాలకు బస్సులు (TSRTC) అందుబాటులో ఉంటాయి.

పెద్దపల్లి నుండి: కేవలం 30 కి.మీ. దూరం.

2. రైలు మార్గం (By Train)

మంథనికి నేరుగా రైల్వే స్టేషన్ లేదు. కానీ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

సమీప స్టేషన్: పెద్దపల్లి జంక్షన్ (Peddapalli Junction). ఇది దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది.

రైలు దిగిన తర్వాత: పెద్దపల్లి రైల్వే స్టేషన్ నుండి మంథనికి వెళ్ళడానికి ప్రైవేట్ వాహనాలు (ఆటోలు, క్యాబ్‌లు) లేదా TSRTC బస్సులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.

మంథని యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది మన సంస్కృతిని, చరిత్రను కళ్ళారా చూసిన ఒక అద్భుతమైన అనుభవం. మీరు కూడా ఇలాంటి ఆధ్యాత్మికతను పొందాలనుకుంటే, తప్పకుండా మంథని గౌతమేశ్వరాలయాన్ని సందర్శించండి.”    

x

Post a Comment

0 Comments